నిశ్చితానికి రెడీ అవుతున్న అక్కినేని నాగ చైతన్య

టాలీవుడ్ నటుడు, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఏ మాయ చేసావే సినిమాతో తన సినీ కెరీర్ లోనే మొదటి హిట్ అందుకున్న నాగచైతన్య అదే సినిమాలో తనతో జోడిగా నటించిన సమంతాను ప్రేమించి 2017 లో పెళ్లి చేసుకున్నాడు. అయితే అభిప్రాయ భేదాల వల్ల ఆ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. సుమారు పెళ్లి చేసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత వారు విడిపోతున్నట్లు తెలియజేశారు. అలాగే ఇరువురి అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగచైతన్య మరో టాలీవుడ్ నటి అయిన శోభిత ధూళిపాళ్ల తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఈరోజు నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల ప్రతి కొట్టి మంది పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుంటున్నారు. ఆ నిశ్చితానికి మీడియాకు కూడా అనుమతి లేదు. నిశ్చితార్థం జరిగిన తర్వాత అక్కినేని నాగార్జున వాడి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోబోతున్నట్లు సమాచారం. అయితే శోభిత దూళిపాళ్ల ఇప్పటికే గూఢచారి, మేజర్, పొన్నియన్ సెల్వాన్, కురుప్ తదితర సినిమాలలో నటించింది. అంతేకాక 2016లో శోభిత ఫెమినా మిస్ ఎర్త్ గా నిలిచారు.