ఫిబ్రవరిలో అఖిల్-సురేందర్ రెడ్డి సినిమా ప్రారంభం

అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అఖిల్‌కు ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో ఈ సినిమాపై అఖిల్‌తో పాటు అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఇందులో మధ్యతరగతి యువకుడిగా అఖిల్ కనిపించనున్నాడు. పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తుండగా.. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు దీనిని తెరకెక్కిస్తున్నాడు.

akhil and surender reddy movie start

ఇక గోపీసుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏప్రిల్ రెండోవారంలో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలయ్యే అవకాశముంది. ఈ క్రమంలోనే మరో సినిమాను అఖిల్ లైన్లో పెట్టాడు. చిరుతో సైరా నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించిన సురేందర్ రెడ్డితో అఖిల్ తన తర్వాతి సినిమాను చేయనున్నాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశముంది.