Chitra Sucide: తమిళ నటి చిత్ర ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు

Chitra Sucide: తమిళ సినీ నటి చిత్ర ఆత్మహత్య ఘటన గత కొద్దిరోజుల క్రితం కోలీవుడ్‌లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఒక ప్రైవేట్ హోటల్‌లో ఆమె ఆత్మహత్య చేసుకోగా.. ఆమె సూసైడ్‌కి భర్త హేమంత్ వేధింపులే కారణమని పోలీసులు గుర్తించారు. భర్త వేధింపుల వల్ల మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు.

CHITRA SUCIDE

ఆమెపై అనుమానంతో కన్యత్వ పరీక్షలు చేయించడానికి హేమంత్ సిద్ధమయ్యాడని తాజాగా చిత్ర సన్నిహితులు బయటపెట్టారు. దాని వల్ల ఆవేదనకు గురై చిత్ర ఆత్మహత్య చేసుకుందని చిత్ర-హేమంత్ కామన్ ఫ్రెండ్ రోహిత్ తాజాగా ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. హేమంత్‌కి గతంలో అనేకమంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని, అది తెలిసి కూడా అతడికి చిత్ర పెళ్లి చేసుకుందని రోహిత్ చెబుతున్నాడు.