తమిళ హీరో అజిత్ నటనలోనే కాదు, రేసింగ్ లో కూడా ఎంతో ఇష్టంగా ఉంటారు. అయితే ఇటీవలే రేసింగ్ చేసేందుకు దుబాయిలో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఒక ప్రమాదం జరిగింది. తాను నడుపుతున్న రేసింగ్ కార్ స్పీడ్ వల్ల అదుపుతప్పి ట్రాక్ మీద నుండి పక్కన ఉన్న గోడకు గట్టిగా ఢీకొనడం జరిగింది. అలా ఢీ కొట్టిన కార్ కొన్నిసార్లు తిరుగుతూ ఒక పక్కకు వెళ్లి ఆగింది. అయితే అదృష్టం కొద్ది అజిత్ కు ఎటువంటి గాయాలు కాలేదు. ఆయనకి ఇలా జరగడం మొదటిసారి కానప్పటికీ జాగ్రత్తగా ఉండమంటూ ఫ్యాన్స్ ఆయనకు సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు.