సెన్సార్ పూర్తి చేసుకున్న `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌`

Agent Sai Srinivasa Athreya censor completed

న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను తెచ్చింది. ఈ చిత్రాన్ని జూన్ 21న విడుద‌ల చేస్తున్నారు.

స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన స్పంద‌న ల‌భించింది. న‌వీన్ ఈచిత్రంలో డిటెక్టివ్ పాత్ర‌ధారిగా న‌టించారు. సినిమా ఆసాంతం ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

డిఫ‌రెంట్ టేకింగ్‌, స్క్రీన్‌ప్లేతో సాగే కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఇది. మ‌ళ్ళీరావా చిత్రాన్ని అందించిన రాహుల్ యాద‌వ్ న‌క్కా ఈ చిత్రాన్ని స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మించారు.

న‌టీన‌టులు: న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె
నిర్మాత‌: రాహుల్ యాద‌వ్ న‌క్కా
బ్యాన‌ర్‌: స‌్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
మ్యూజిక్‌: మార్క్ కె.రాబిన్‌(అ! ఫేమ్‌!
కెమెరా: స‌న్నీ కూర‌పాటి
సౌండ్‌: నాగార్జున్ తాళ్ల‌ప‌ల్లి(కేరాఫ్ కంచ‌రపాలెం ఫేమ్‌)
ఆర్ట్‌: క‌్రాంతి ప్రియం
పి.ఆర్‌.ఒ: వంశీ శేఖ‌ర్‌