బోయపాటి చిత్రంలో ఆది పినిశెట్టి – అఖండ 2లో నటించనున్నాడా?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ‘అఖండ 2: తాండవం’ కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. వారి మునుపటి బ్లాక్ బస్టర్ అఖండకు ఈ సీక్వెల్ యాక్షన్, ఇంటెన్స్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.

మోస్ట్ ట్యాలెంటెడ్ ఆది పినిశెట్టి తన కెరీర్‌లో ఒక ఎక్సయిటింగ్ చాపర్ట్ ని మార్క్ చేస్తూ, ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రను పోషించబోతున్నారు. సరైనోడు సినిమాలో ఆదిని ఇంటెన్స్ పాత్రలో చూపించిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఆయన కలిసి చేస్తున్న రెండవ సినిమా ఇది.

అన్ని పాత్రలకు గొప్ప ప్రాముఖ్యత ఇవ్వడంలో పేరుపొందిన బోయపాటి, ఆది పాత్రను ఫెరోషియస్ గా రూపొందించారు, ఇది తన కెరీర్‌లో మోస్ట్ ఇంపాక్ట్ పాత్రలలో ఒకటిగా నిలుస్తుంది. ఆది ఈ మూవీలో కొత్త లుక్‌ లో కనిపించనున్నారు. బాలకృష్ణ, ఆది మధ్య జరిగే పేస్ అఫ్ అభిమానులకు ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లింగ్ విజువల్ ఫీస్ట్ అందించబోతోంది.  

ప్రస్తుతం, ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ నిర్మించిన గ్రాండ్ సెట్‌లో జరిగుతోంది, అక్కడ బ్రెత్ టేకింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సీక్వెన్స్‌ను రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షిస్తున్నారు. బాలకృష్ణ, ఆది పినిశెట్టి ఇద్దరూ ఈ యాక్షన్-ప్యాక్డ్ షూట్‌లో పాల్గొంటున్నారు, వారి పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను తమ సీట్ల ఎడ్జ్ లో ఉంచుతాయి. ఈ సన్నివేశం సినిమాలోని మెయిన్ హైలైట్లలో ఒకటిగా ఉండనుంది.

బాలకృష్ణ పాత్రను మోఎస్ట్  డైనమిక్‌గా రూపొందించారు బోయపాటి. భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌లో సంయుక్త ఫీమేల్ లీడ్ గా కనిపించనుంది. సంగీత సంచలనం ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు, సినిమాటోగ్రాఫర్ సి రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ వంటి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు.

అఖండ 2 పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలోకి రానుంది.

నటీనటులు: గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
సమర్పణ: ఎం తేజస్విని నందమూరి
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: C రాంప్రసాద్, సంతోష్ D Detakae
ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో