అడవి శేష్ కి కరోనా ‘మేజర్’ బ్రేక్

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న యంగ్ హీరో అడవి శేష్. క్షణం నుంచి ఎవరు వరకూ తన మార్క్ ఎక్కడా మిస్ అవ్వకుండా అడవి శేష్ జానర్ మూవీ అనే రేంజ్ కి వెళ్లిన ఈ హీరో యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ మేజర్. ముంబై బాంబ్ బ్లాస్ట్స్ లో దేశం కోసం మరణించిన మేజర్ ఉన్నికృష్ణన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయ్యి, మేజర్ ఎలా ఉండబోతుందో చూపించింది. ఇక థియేటర్స్ లో ఈ సినిమాని జులై 2న చూడడమే ఆలస్యం అనుకుంటున్న టైములో కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది. ఈ కరోనా కారణంగా మేజర్ సినిమాని అనుకున్న టైంకి విడుదల చేయలేకపోతున్నట్లు అడవి శేష్ అనౌన్స్ చేశాడు. ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా తెలియజేసిన శేష్, మేజర్ సినిమా మాములుగా ఉండదు. ఐ ప్రామిస్ అంటూ ట్వీట్ చేశాడు. దేశ భక్తి కథలకి, వీరుల సినిమాలకి మన దేశంలో గిరాకీ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మేజర్ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వచ్చినా హిట్ అవ్వడం గ్యారెంటీ. సో ఆ మొమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం. Till Then Stay Home Stay Safe. Avoid Roaming Outside.