నటి సోనాలి సైగల్ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ 27న తనకు బిడ్డ పుట్టినట్లు ఆమె ఇన్స్టా వేదికగా ప్రకటించారు. చిన్నారికి ‘శుకర్’ అని పేరు పెట్టినట్లు చెప్పారు. గతేడాది ఆశేష్ ఎల్ సజ్నానిని సోనాలి వివాహం చేసుకున్నారు. ఆమె హైజాక్, వెడ్డింగ్ పులావ్, ప్యార్ కా పంచ్నామా సినిమాలతో పాటు పలు వెబ్ సిరీసుల్లో నటించారు.