సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్ లో ఉందొ ఇప్పుడిప్పుడే కొంత మంది హీరోయిన్స్ ద్వారా క్లియర్ గా అర్థమవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. తనకు కూడా చాలా సార్లు అలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి అని ఆమె వివరణ ఇచ్చింది.
ఆమె మాట్లాడుతూ.. సక్సెస్ అయిన చాలా మంది తమకు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురవ్వలేవు అని చెబుతుంటారు. కానీ సక్సెస్ కానీ వారు మాత్రం క్యాస్టింగ్ కౌచ్ ఫిర్యాదులు ఎక్కువగా చేస్తారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొందరు అమ్మయిల కోసమే సినిమా తీసే పరిస్థితి కనిపిస్తోంది. అందంగా ఉంటే చాలు దర్శకనిర్మాతలు ఆఫర్స్ ఇస్తున్నారు. అయితే క్యాస్టింగ్ కౌచ్ అనే దానికి ఒప్పుకోవాలా లేదా అనేది వారి చేతుల్లోనే ఉంటుంది నాకు కూడా కొన్నిసార్లు అలాంటి ఆఫర్స్ రాగా నేను రిజెక్ట్ చేశాను’ అని నటి ప్రగతి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది