Bollywood: స‌ల్మాన్ పిలిచాడ‌ని ముంబైకి వెళ్తున్న పూజాహెగ్దే..

Bollywood: బ్యూటీ హీరోయిన్ పూజాహెగ్దే ప్ర‌స్తుతం త‌న హావా న‌డిపిస్తోంది.. అల్లుఅర్జున్ న‌టించిన అల వైకుంఠ‌పురం చిత్రంతో భారీ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ అమ్మ‌డు.. ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధేశ్యామ్‌లో న‌టించింది.. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతుంది. అలాగే Bollywood బాలీవుడ్‌లో కూడా త‌న అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇప్పుడు త‌మిళ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతుంది.. ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్నా 65వ సినిమాలోనూ ఈ బ్యూటీ అవ‌కాశం ద‌క్కించుకుంది. నెల్స‌న్ దిలీప్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.

Salmankhan

ఇక బాలీవుడ స్టార్ కండ‌ల వీరుడు Bollywood స‌ల్మాన్ ఖాన్ హీరోగా క‌బీ ఈద్ క‌బీ దివాళి చిత్రం తెర‌కెక్కుతుంది. ఈ చిత్రానికి ఫ‌ర్హాద్ సంజీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా.. ఇందులో స‌ల్మాన్‌తో రొమాన్స్ చేయ‌నుంది బుట్ట‌బొమ్మ పూజా హెగ్దే. ఈ Bollywood సినిమా షూటింగ్ కోసం చెన్నై నుంచి ముంబై వెళుతుంది. ఇక ఈ చిత్రంలో స‌ల్మాన్ మేన‌ల్లుడు ఆయుశ్ శ‌ర్మ‌, జ‌హీర్ ఇక్బాల్ ఓ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ దశ‌లో ఉంది.