Megastar: మెగాస్టార్ “ఆచార్య” నుంచి మ‌రో స‌రికొత్త అప్‌డేట్‌..

Megastar: మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య చిత్రం స‌రికొత్త అప్‌డేట్ ప్ర‌క‌టించింది. నేడు మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ బ‌ర్త్‌డే కానుక‌గా ఈ రోజు ఆచార్య నుంచి స‌రికొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఆ పోస్ట‌ర్‌లో ఆచార్య‌తో ఈ సినిమాలో సిద్ధ పాత్ర‌లో న‌టించిన రాంచ‌ర‌ణ్ క‌నిపిస్తారు. ఈ పోస్ట‌ర్ మెగా ఫ్యాన్స్‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. కాగా తాజాగా మ‌రో అప్‌డేట్ వ‌చ్చింది.. ఆచార్య చిత్రం నుంచి లాహే లాహే అనే సాంగ్ లిరిక‌ల్ వీడియోను మార్చి 31న సాయంత్రం 4.05గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

Acharya

ఈ మేర‌కు రాంచ‌ర‌ణ్ ఆ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశాడు.. ఆ పోస్ట‌ర్‌లో మెగాస్టార్ చిరంజీవి లాహే లాహే సాంగ్‌కు కాలు క‌దుపుతూ చిరంజీవిని చూస్తుంటే.. రామ్మాచిల‌క‌మ్మా అనే సాంగ్‌లో Megastar చిరంజీవి డ్యాన్స్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సోనూసూద్‌, పూజా హెగ్దే వంటి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.