ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు జెసి ప్రభాకర్ రెడ్డి సినీ హీరోయిన్లపై కొన్ని అనుచిత చేసిన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా నటి మాధవిలాలపై కూడా ఆయన కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. వాటిపై స్పందిస్తూ నటి మాధవి లత జెసి ప్రభాకర్ రెడ్డి పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… “హెచ్ఆర్సీ, పోలీసులకు నేను ఫిర్యాదు చేశాను. నాపై జెసి ప్రభాకర్ రెడ్డి దారుణంగా మాట్లాడం జరిగింది. దీనిపై సినీ పరిశ్రమ స్పందించలేదు. అందుకే మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేశాను. నేను కాల్ చేసిన వెంటనే మా అసోసియేషన్ ట్రెజరర్ శివ బాలాజీ గారు స్పందించారు. ఈ విషయాన్ని మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారి వద్దకు తీసుకుని వెళ్లడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేయడం దారుణం” అని అన్నారు.
నటుడు, మా అసోసియేషన్ ట్రెజరర్ శివ బాలాజీ మాట్లాడుతూ… “రాజకీయ నాయకులు సినీ ఇండస్ట్రీ జోలికి రావద్దు. మీరు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టండి. ఎంఎస్సీ వారి వ్యక్తిగత జీవితాలపై స్పందించడం సరికాదు. మాధవి లత గారు చేసిన ఫిర్యాదు పై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం” అన్నారు.