నేడు ఉదయం మహానటి చిత్ర హీరోయిన్ కీర్తి సురేష్ తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించడం జరిగింది. తన కుటుంబంతో కలిసి స్వామివారికి సేవలో పాల్గొన్నారు కీర్తి సురేష్. ఈ సందర్భంగా మీడియా వారు తన పెళ్లి గురించి ప్రశ్నించగా ఆమె ఎలా సమాధానం ఇచ్చారు. తన పెళ్లి వచ్చే నెల డిసెంబర్ 11, 12వ తేదీల్లో గోవాలో జరగబోతుందని ఆమె తెలిపారు. పెళ్లి దగ్గర పడడంతో స్వామివారిని దర్శించుకోవడం కోసం తిరుమలకు వచ్చారని, అలాగే త్వరలోనే తన నెక్స్ట్ సినిమా రాబోతుందని ఈ సందర్భంగా ఆమె తెలపడం జరిగింది. అయితే తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో ఆమె సుమారు 15 సంవత్సరాలుగా రిలేషన్షిప్ లో ఉండి చివరిగా పెద్దలను ఉపయోగించుకుని వచ్చేనెల డిసెంబర్ లో గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వివరణ వచ్చింది.