టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లును ఇటీవల ముంబైలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. జిలకర బెల్లం అనే తెలుగు ఆచారాలను పాటించిన కాజల్ ఆడియెన్స్ ని మరింత ఎట్రాక్ట్ చేశారు. ఇక పెళ్లికి ఆమె వేసుకున్న కాజల్ భారీ ఎంబ్రాడయరీ లెహంగా కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఫ్లోరల్ డిజైన్‌లో జర్దోసి వర్క్ వేయడానికి నెలరోజుల సమయం పట్టిందట.
దాదాపు 20 మంది శ్రమించారని తెలుస్తోంది. దీని విలువ లక్షల్లో ఉంటుందని సమాచారం. సునీతా షెకావత్ తయారు చేసిన అభరణాలు కూడా కాజల్ కి మరింత అందాన్ని ఇచ్చాయి. వరుడు గౌతమ్ కిచ్లు కూడా ఖరీదైన తెలుగు రంగు షెర్వాణీని ధరించారు. దాని విలుబ లక్షా 15వేలు అని తెలుస్తుంది. అనితా డోంగ్ ఈ డ్రెస్ ని డిజైన్ చేశారు. ఇక ఇప్పట్లో కాజల్ హనీమూన్ చేసుకునే అవకాశం లేదట. త్వరలో ఆచార్య షూటింగ్ తో బిజీ కావాలి కాబట్టి ఆ పనులు పూర్తయిన తరువాత హనీమూన్ కి వెళ్లనున్నారని సమాచారం.