కాజల్ ప్రేమ ఎప్పుడు మొదలైందంటే?

అక్టోబర్ 20న గౌతమ్ కిచ్లు అనే బిజినెస్ మెన్ ను వివాహం చేసుకోనున్న కాజల్ మొత్తానికి బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ పెట్టబోతోంది. అయితే ఈ బ్యూటీ మ్యారేజ్ గత ఏడాది ఫిక్స్ అయ్యిందని అంతా అనుకుంటున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్ అయినప్పటికీ గౌతమ్ తో వివాహాన్ని ఈ మధ్యనే నిశ్చయం చేసుకున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. నిజానికి కాజల్ ప్రేమ ఇప్పుడు మొదలైంది కాదు.

గత ఆరేళ్ళ నుంచి చందమామ గౌతమ్ తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కెరీర్ ని అర్థం చేసుకున్న గౌతమ్ పర్ఫెక్ట్ పాట్నర్ అని ఈ బ్యూటీ ఎప్పుడో డిసైడ్ అయ్యిందట. కానీ చాలా ఇంటర్వ్యూలో మాత్రం అమ్మడు తాను సింగిల్ అన్నట్లు మ్యానేజ్ చేసింది. ఏదేమైనా కాజల్ ఓ వర్గం వారికి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక పెళ్లి తరువాత కూడా తన సినిమా కెరీర్ లో ఎలాంటి మార్పు ఉండదని చెప్పిన చందమామ ఎప్పటిలానే ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తానని చెప్పింది. ఇక భవిష్యత్తులో అమ్మడు ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.