1994లో భైరవద్వీపం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన నటుడు విజయ రంగరాజు ఈరోజు చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పటల్లో మరణించడం జరిగింది. వారం క్రితం ఒక సినిమా కోసం హైదరాబాద్లో షూటింగ్ చేస్తుండగా ఆయన గాయపడడం జరిగింది. ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుండెపోటుతో చనిపోయారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు. గోపీచంద్ హీరోగా నటించిన యజ్ఞం సినిమా ద్వారా విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. విలన్ గానే కాకుండా సహాయ పాత్రలలో కూడా ఆయన ఎన్నో తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించారు. అంతేకాకుండా ఆయనకు వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో కూడా ప్రవేశం ఉంది.