కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వర్సటైల్ యాక్టర్ సంజయ్ కపూర్. విషయం ఉన్న పాత్రల్లో కనిపించే సంజయ్, ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. లస్ట్ స్టోరీస్, గాన్ గేమ్ లాంటి సక్సస్ ఫుల్ సిరీస్ లు చేస్తున్న సంజయ్ ప్రెజెంట్ సినిమా ట్రెండ్ గురించి తన అభిప్రాయం వెల్లడించాడు. 50 కోట్లు పెట్టి స్టార్ హీరోని తీసుకోని వచ్చి భారీ బడ్జట్ సినిమాలు చేసే రోజులు పోయాయని చెప్పిన సంజయ్, ఓటీటీలు ప్రొడక్షన్ లోకి రావడం మంచి పరిణామం అని చెప్పాడు.
90ల్లో సినిమా అంటే హీరోనే సినిమా అంతా ఉండేవాడని, ఫైట్లు ఆరు పాటలు పాటలు పాడుతూ చేస్తుండే వాడని.. ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్ లేదని తెరపై కనిపించే ప్రతి పాత్రకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అన్నాడు. తాను నటించిన మిషన్ మంగళ్ సినిమానే ఉదాహరణగా చెప్పిన సంజయ్, సినిమాలో అక్షయ్ విద్యా లాంటి స్టార్స్ ఉన్నా కూడా అందులో నటించిన మిగిలిన పత్రాలు కూడా సినిమాలో చాలా ముఖ్యమని… ప్రతి పాత్ర సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేసిందని, ఫ్యూచర్ లో వచ్చే మూవీస్ కూడా హీరో సెంట్రిక్ కాకుండా స్టోరీ సెంట్రిక్ వస్తాయని చెప్పాడు. సంజయ్ చెప్పిన మాట అక్షర సత్యం, ఎందుకంటే తెరపై పాత్రలు కథలో భాగం కాకపోతే చూసే వారికి ఆ పాత్ర ఎందుకు వస్తుందో, ఆ వ్యక్తి ఎందుకు డబ్బులు ఇచ్చి తీసుకోని వచ్చారో కూడా అర్ధం కాదు.