విడిపోయిన జంట సోషల్ మీడియాలో సందడి చేసింది

బ్రాడ్ పిట్, జెన్నిఫర్ అనిస్టన్ ఒకప్పటి హాలీవుడ్ జంట. 2000లో పెళ్లి చేసుకోని ఒక్కటైన ఈ జంట 2005లో డివోర్స్ తీసుకున్నారు. ఈ ఇద్దరూ విడిపోవడం అప్పట్లో ఒక సెన్సేషన్ న్యూస్ అయ్యి, ఈ డివోర్స్ హై ప్రొఫైల్ న్యూస్ గా మారింది. ఆ తర్వాత ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్న ఈ జంట మళ్లీ కలిసింది. అయితే అది ఆన్లైన్ లో కావడం, అది కూడా ఒక మంచి కారణం కోసం కావడం విశేషం.

Fast Times at Ridgemont High టేబుల్ రీడింగ్ కోసం ఆన్లైన్ లో కలిసిన ఈ జంట చాలా సరదాగా మాట్లాడుకున్నారు. వీరిని చూసిన అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ వీడియోని వైరల్ చేశారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత బ్రాడ్ పిట్, జెన్నిఫర్ కలవడం హాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఇది చారిటీ కోసమే అయితే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యేది కాదు కానీ దాదాపు దశాబ్దమున్నర పాటు కలవని వారు, బ్రాడ్ పిట్ ఎంజిలీనా జోలీతో విడిపోయిన తర్వాతే కలవడం… ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ లా మాట్లాడుకోవడమే హాట్ టాపిక్ గా మారింది. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి విడిపోయిన ఈ జంట మళ్లీ కలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.