‘మెహందీ’, ‘ఫరేబ్’ వంటి చిత్రాల ద్వారా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ బాలీవుడ్ నటుడు ఫరాజ్ ఖాన్ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో చావుబతుకుల మధ్య ఉన్నారు. చికిత్స కొసం రూ.25లక్షలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ నటుడు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా సహాయం చేసి తన సోదరుడిని బ్రతికించాలని ఆయన తమ్ముడు ఫామాన్ ఖాన్ మీడియా ముందుకి వచ్చాడు.
బెంగళూరు కన్నింగ్‌హాం రోడ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫరాజ్ వారం రోజులుగా ల్ ఐసీయూలోనే ఉన్నాడు. అయితే ఇంతవరకు ఉన్న డబ్బు మొత్తం హాస్పిటల్ ఖర్చులకే అయిపోవడంతో ఇంకా 25లక్షలు అవసరం అవుతాయని అందుకే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇక ఈ నటుడి ఆరోగ్యం గురించి తెలుసుకున్న సిమియర్ నటి పూజా భట్ తనవంతు సహాయం అంధించి అభిమానులు కూడా సహాయం చేయవల్సిందిగా ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు