యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్కు ఎవరెవరు వచ్చారో తెలుసా?

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల వివాహం రీసెంట్ గా జరిగిన విషయం అందరికీ తెలిసిందే .కాగా జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్ లో సినీ, రాజకీయ అతిరధ మహారధుల సమక్షంలో ఐశ్వర్య అర్జున్ దంపతుల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమిళనాడు సీఎం స్టాలిన్, హీరో రజనీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవా, డైరెక్టర్ లోకేష్ కనక రాజ్, సత్యరాజ్ ,కుష్బూ, విజయ్ సేతుపతి, హీరో శివ కార్తికేయన్, తమిళనాడు బిజెపి అధ్యక్షులు అన్నామలై, స్నేహ రోజా, తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. వారి రిసెప్షన్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి.