బిగ్ బాస్ 4 ఆదివారం గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. ఈ సారి అంచనాలకు తగ్గట్లుగా బడా స్టార్స్ కంటెస్టెంట్స్ గా రాకపోయినప్పటికి కొంత వినూత్నమైన స్వభావాలు కలిగిన వారు ఎంట్రీ ఇచ్చారు. ఇక సూర్య కిరణ్ ఎవరు అనేది అందరి మదిలో ఎన్నో సందేహాలను కలిగిస్తోంది. అతని వివరాల్లోకి వెళితే..
సూర్య కిరణ్ అసలు పేరు.. సుబ్రమణి రాధా సురేష్. రచయిత మరియు దర్శకుడు. సుమంత్ నటించిన సత్యం, ధనా 51, మంచు మనోజ్ నటించిన రాజు భాయ్ వంటి సినిమాలకు సూర్య కిరణ్ దర్శకత్వం వహించాడు. దర్శకుడి కంటే ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. సౌత్ సూపర్ స్టార్స్ చిరంజీవి, నాగార్జునలతో పాటు దాదాపు 200 కి పైగా సినిమాల్లో చైల్డ్ యాక్టర్ గా నటించారు. నాగార్జున సంకీర్తన చిత్రంలో చిన్నప్పటి నాగార్జునగా కూడా కనిపించాడు.
‘మాస్టర్ సురేష్’ అనే పేరు వచ్చినప్పటికి ఆ తరువాత అతను తన పేరును సూర్య కిరణ్ గా మార్చాడు. నటన, సినిమా పట్ల ఆయనకున్న ఆసక్తి కారణంగా తన బ్యాచిలర్ చదువును ఆపేసి దర్శకుడిగా మారాడు. నాగార్జున అక్కినేని నిర్మించిన 2003 తెలుగు చిత్రం సత్యం ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆ తరువాత, కొంత ఆర్థిక నష్టాల కారణంగా, అతను పరిశ్రమ నుండి బ్రేక్ తీసుకున్నాడు. త్వరలో మళ్ళీ దర్శకుడిగా బిజీ అవ్వాలని క్రేజ్ కోసం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.