ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగ‌స్ట్ 15న ‘ఆయ్’ పెయిడ్ ప్రీమియర్స్

సక్సెస్‌ఫుల్ నిర్మాణ సంస్థ‌ GA2 పిక్చర్స్ బ్యానర్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఇప్ప‌టికే ఆయ్ సినిమా నుంచి విడుద‌లైన పాట‌లు చార్ట్ బ‌స్ట‌ర్స్‌గా ప్రేక్ష‌కుల నుంచి అదర‌ణ‌ను పొందాయి. అలాగే సోష‌ల్ మీడియాలో రీల్స్‌, షార్ట్స్ బాగా వైర‌ల్ అయ్యాయి. తాజాగా మేక‌ర్స్ ఈ చిత్రాన్ని స్వాతంత్య్రదినోత్స‌వ సంద‌ర్భంగా వ‌ర‌ల్డ్ వైడ్ ఆగ‌స్ట్ 15న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

గోదావ‌రి బ్యాక్ డ్రాప్‌లో హృద‌యానికి హ‌త్తుకునేలా మ‌న‌సారా న‌వ్వుకునేలా ఈ సీజ‌న్‌లో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆయ్ చిత్రం మెప్పించ‌టానికి సిద్ధ‌మైంది. నార్నే నితిన్ ఆడియెన్స్‌ను అల‌రించ‌బోతున్నారు.  ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ  సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.