సైంటిఫిక్‌ రొమెడీగా ‘పార్ట్‌నర్‌’

ఆది పినిశెట్టి, హన్సిక మొత్వాని, పల్లక్‌ లల్వాని హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘పార్టనర్‌’. సైంటిఫిక్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాయల్‌ ఫార్చునా క్రియేషన్స్‌ బ్యానర్‌ నిర్మాణంలో ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్‌ మనోజ్‌ దామోదరన్‌ తెరకెక్కిస్తున్నారు. ‘మరకతమణి’ వంటి డిఫరెంట్‌ మూవీ తర్వాత మరోసారి డిఫరెంట్‌ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్‌, రెండు పాటల చితీరకరణ పూర్తయ్యాయి. మరో రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. సైంటిఫిక్‌ రొమెడీగా ప్రేక్షకుల ముందుకు 2020 ప్రథమార్థంలో ‘పార్ట్‌నర్‌’ సినిమా విడుదల కానుంది.

ఈ పుట్టినరోజు ఆది పినిశెట్టికి ఎంతో ప్రత్యేకం కానుంది. ఆది మూడు భిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా ‘పార్టనర్‌’ చిత్రంతో పాటు ఆయన పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో నటిస్తోన్న స్పోర్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ ‘క్లాప్‌’… నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమాలోని లుక్స్‌ను విడుదల చేశారు.

నటీనటులు:
ఆది పినిశెట్టి, హన్సిక మొత్వాని, పల్లక్‌ లల్వాని, పాండిరాజన యోగిబాబు, జాన్‌ విజయ్‌, రోబో శంకర్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: మనోజ్‌ దామోదరన్‌
నిర్మాత: రాయల్‌ ఫార్చున క్రియేషన్స్‌
సినిమాటోగ్రఫీ: షబీర్‌ అహమద్‌
సంగీతం: సంతోష్‌ దయానిధి
ఎడిటర్‌: గోపీ కృష్ణ