విజయ్‌ దేవరకొండ సింగరేణి ప్రేమికురాలు

క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ జీవితంలోని నాలుగు దశల్లో నలుగురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. వీరిలో విజయ్‌ భార్యగా, తెలంగాణ అమ్మాయి సువర్ణగా ఐశ్వర్యా రాజేష్‌.. ఫ్రెంచ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఇజా పాత్రలో నటిస్తోన్న ఇజా బెల్లె లియెతె లుక్స్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. శనివారం క్యాథరిన్‌ థ్రెసా లుక్‌ను విడుదల చేశారు. ఇందులో క్యాథరిన్‌కు సింగరేణి ప్రాంతానికి లింక్‌ ఉంది. ఆమె విజయ్‌ను శ్రీనుగా సంబోధిస్తుంది.

పాత్ర పరంగా సింగరేణి ప్రాంతంతో తనకున్న రిలేషన్‌ గురించి “బొగ్గు గనిలో నా బంగారం, నా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌. ఈ వేలంటెన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న శ్రీనును కలుసుకుందాం” అంటూ క్యాథరిన్‌ మెసేజ్‌ను పోస్ట్‌ చేసింది.

ఖాకీ చొక్కా, ప్యాంటు వేసుకుని సింగరేణి కార్మికుడిగా విజయ్‌ దేవరకొండ కనపడుతున్నారు. ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ స్మిత పాత్రలో క్యాథరిన్‌ కనపడుతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన విజయ్‌ దేవరకొండ రెండు లుక్స్‌కు ఈ లుక్‌ డిఫరెంట్‌గా ఉంది.

జనవరి 3న ఈ సినిమా టీజర్‌ విడుదలవుతుంది. ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు సమర్పణలో కియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. గోపీసుందర్‌ మ్యూజిక్‌, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.