తెలుగు హీరోగా ఓ తమిళ నటుడు

ఈ మధ్యకాలంలో చూసుకుంటే తమిళ్ హీరోలు తెలుగు సినిమాలలో నటించడం అలాగే తమిళ్ ఆర్టిస్టులు తెలుగు సినిమాలలో హీరోలుగా నటించడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మరో తమిళ నటుడు ఇప్పుడు ఓ తెలుగు సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. గతంలో తమిళ్ సినిమాలో అయినా నా పేరు శివ, కెప్టెన్ మిల్లర్ తదితర సినిమాలలో నెగిటివ్ రోల్స్ లేదా సైడ్ క్యారెక్టర్ గా కనిపిస్తూ వచ్చిన నటుడు వినోద్ కిషన్. ఇటీవలే విశ్వక్ సేన్ కథానాయకుడుగా నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు బాహుబలి, మిర్చి, బద్రీనాథ్ వంటి సినిమాలలో నటించిన రాకేష్ వర్రే నిర్మిస్తున్న సినిమా పేకమేడలు. క్రేజీ యాంట్స్ నిర్మాణ సంస్థ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఈనెల 19న రాబోతుంది. ఈ పేకమేడలు సినిమాలో కథానాయకుడిగా వినోద్ కిషన్ నటించారు. నీలగిరి మామిళ్ళ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు హరిచరణ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

నంద అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన అతను ఆ తర్వాత సంస్థానం, సేన వంటి సినిమాలలో పనిచేశారు. ఆ తర్వాత నాన్ మహాన్ అల్ల అనే సినిమాలో బెస్ట్ విలన్ గా అవార్డు తన సొంతం చేసుకున్నారు. వినోద్ కిషన్ తెలుగు, తమిళ సినిమాలోని కాకుండా కొన్ని మలయాళం సినిమాల్లో కూడా నటించడం జరిగింది.