హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్నటువంటి N కన్వెన్షన్ ఈరోజు ఉదయం కూల్చి వేయడం జరిగింది. నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన N కన్వెన్షన్ మాదాపూర్ లోని ఓ చెరువుకు సంబంధించిన మూడు ఎకరాలకు పైగా స్థలం ఆక్రమించి దానిలో కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైడ్రా సంస్థలు ఈరోజు తెల్లవారుజామున 4-5 పెద్ద మిషన్స్ సహాయంతో N కన్వెన్షన్స్ లోని కొంత భాగాన్ని పూజ చేయడం జరిగింది. ఈ కూల్చివేత భారీ భద్రతల మధ్య చేయడం జరిగింది. అంతేకాక 2016లో నేటి సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో టీడీపీ ఎంమ్మెల్యేగా ఉండగా N కన్వెన్షన్కు సంబంధించి శాసన సభా ముఖంగా నాగార్జున అక్రమ నిర్మాణంపై ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు అని ప్రశ్నించిన వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతుంది.