హైదరాబాదు ప్రిజం పబ్ లో ఒక సంఘటన జరిగింది. బత్తుల ప్రభాకర్ అనే ఒక గజదొంగ ఆ పబ్ లో ఉన్నాడని తెలిసిన హైదరాబాద్ పోలీసులు అతడిని పబ్ లో పట్టుకోడానికి ప్రయత్నించగా ప్రభాకర్ పోలీసులపై కాల్పులు జరిపాడు. అయితే ఎట్టకేలకు ఒక కానిస్టేబుల్ గాయపడగా ప్రభాకర్ ను పోలీసులు పట్టుకోవడం జరిగింది. అతనిపై తెలంగాణలో 11 కేసులు, ఆంధ్రాలో 12 కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ షూట్ ఔట్ లోప్రభాకర్ తో పాటు నరేంద్ర అని మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తుంది. ఆ సమయంలో అక్కడి నుండి తప్పించుకున్న నరేంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు. నరేంద్ర ఒక చిత్రానికి దర్శకుడుగా చేసినట్లు సమాచారం. అయితే ఏ చిత్రానికి నరేంద్ర దర్శకత్వం చేశాడు, అతను ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది.