ఒకవైపు అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకోవాలని దేశమంతా ప్రార్థనలు చేస్తుంటే కొందరు దుండగులు మాత్రం ఊహించని విదంగా ఆయన మరణాన్ని కోరుకోవడం షాక్ ఇస్తోంది. ఈ విషయంపై అమితాబ్ బచ్చన్ చాలా సీరియస్ అయ్యారు. బహిరంగంగా లేఖను విడుదల చేసిన మెగాస్టార్ అతనికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
అమితాబ్ ఈ విదంగా రాసారు.. ‘నేను చచ్చిపోవలని కోరుకుంటున్న నువ్వు పేరు చెప్పలేదు. కనీసం నీ తండ్రి పేరు కూడా పేర్కొనలేదు. అంటే మీ తండ్రి ఎవరో నీకు తెలియదన్నమాట. ఇక్కడ రెండు జరగవచ్చు. నేను చనిపోవచ్చు.. లేదా బ్రతకావచ్చు. అయితే ఆ తరువాత నువ్వు ఎదుర్కొనబోయే తుఫానును నువ్వు ఊహించలేవు. నిన్ను తన్నమని ఒక్క మాట చెప్పినా 90మిలియన్ల మంది కోపాన్ని నువ్వు ఏ మాత్రం తట్టుకోలేవు. నేను ఇంకా వారికి ఈ విషయం చెప్పలేదు. చెబితే నిర్ములన మాత్రమే ఉంటుంది. జాగ్రత్తగా ఉండు’ అని అమితాబ్ బచ్చన్ లేఖలో తెలియజేశారు