మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంది కీర్తి సురేష్. ఆ తరువాత మంచి అవకాశాలతో జయపజయలతో సంబంధం లేకుండా ఇతర హీరోయిన్స్ కి గట్టి పోటీని ఇస్తోంది. అయితే ఇటీవల ఆమె తనకు వచ్చిన ఒక లవ్ లెటర్ గురించి వివరణ ఇచ్చింది. ఆ లెటర్ ని భద్రంగా దాచుకున్నట్లు కూడా చెప్పింది.
కీర్తి సురేష్ మాట్లాడుతూ.. నేను ఒక జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్ కి వెళ్లినప్పుడు ఒక యువకుడు జనాల్లో నుంచి స్పీడ్ గా వచ్చి నాకు ఒక పెద్ద లెటర్ ఇచ్చాడు. అది ఓపెన్ చేయగానే నా ఫొటోస్ కలెక్షన్స్ చాలానే ఉన్నాయి. అందులో తనను మ్యారేజ్ చేసుకోవాలని ప్రపోజ్ కూడా చేశాడు. ఓ విధంగా ఆ స్పెషల్ లెటర్ నాకు చాలా నచ్చింది. దాన్ని అలానే దాచుకున్నా. ఎందుకంటే నాకు కాలేజ్ డేస్ లో కూడా లవ్ లెటర్స్ రాలేవు అని కీర్తి సురేష్ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నితిన్ రంగ్ దే తో పాటు తెలుగు తమిళ్ లో నాలుగు సినిమాలు చేస్తోంది.