పలాస 1978” తో హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా కు “W H O” (World Hazard Ordinance ) అనే టైటిల్ ని నిర్ధారించారు. కరోనా వైరస్ వెనక ఎలాంటి కుట్ర జరిగిందనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. సైబర్ హ్యాకింగ్ బ్యాక్ డ్రాప్ లో సైంటిఫిక్ థ్రిల్లర్ గా రానున్న ఈ మూవీని సుధాస్ మీడియా సమర్పణలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో నిర్మించబోతుంది.
“I’m gonna tell god everything” వంటి వైవిధ్య మైన హాలీవుడ్ షార్ట్ ఫిలిం తో విమర్శకుల ప్రశంసలు తో పాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన దేవ్ పిన్నమరాజు ఈ కథ తో దర్శకుడి గా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను అమెరికా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, ఇండియా-చైనా బార్డర్ లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తారు.