బిగ్ బాస్ నాలుగవ సీజన్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు స్టార్ మా అఫీషియల్ లోగోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి బిగ్ బాస్ పై ఆసక్తి ఎక్కువవుతొంది. ఎందుకంటే ఈ కరోనా కష్టాల్లో షో కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే కంటెస్టెంట్ లిస్ట్ ని దాదాపు రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే షోలో పాల్గొనడానికి 15 రోజుల ముందే వారికి కరోనా టెస్టులు నిర్వహించనున్నారట. అనంతరం వారిని క్వారంటైన్ లోనే ఉంచి హౌజ్ లోకి అడుగు పెట్టె ముందు మరోసారి టెస్టులు చేయనున్నట్లు తెలుస్తోంది.
అంతా బాగానే ఉంది కానీ కరోనా వైరస్ ని అదుపు చేయడం సాధ్యమయ్యే విషయమేనా అనే టాక్ వస్తోంది. దాదాపు మూడు నెలల పాటు షో కోసం కెమెరా వెనుక ఎంతో మంది పని చేస్తారు. షోలో కంటెస్టెంట్స్ కోసం ఫుడ్, అలాగే నిత్యావసర వస్తువులు ఎన్నో అందించాల్సి ఉంటుంది. పైగా ప్రమోషన్స్ లో భాగంగా సెట్స్ లో కొన్ని బ్యానర్లను మార్చాల్సి ఉంటుంది.
ఇలా వందల రకాల పనులు జరుగుతున్నప్పుడు దాని వెనుక వందల మంది పని చేస్తుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టెక్నీషియన్స్ ఎంత జాగ్రత్తగా ఉన్నా వస్తువుల ద్వారా కరోనా రాకుండా ఉంటుందా.. ఒకవేళ వాటి కోసం తగిన జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇతర వర్కర్స్ వల్ల ప్రమాదం ఉండదు అనే గ్యారెంటీ లేదు.
మొత్తంగా కరోనా వైరస్ కోసం బిగ్ బాస్ టీమ్ ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిని కలిగిస్తోంది. పొరపాటున హౌజ్ లోకి వైరస్ వస్తే గనక షోపై తీవ్ర ప్రభావం పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ముందు జాగ్రత్తగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.