కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికే థియేటర్స్ మూతపడి 4 నెలలు దాటింది. రిలీజ్ కావాల్సిన చాలా సినిమాలు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. నష్టాల నుంచి తప్పించుకోవడానికి కొన్ని సినిమాలు డైరెక్ట్ గా OTT ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల అవుతున్నాయి. ఇక థియేటర్స్ ఓపెన్ కావడానికి మరికొన్నాళ్లు సమయం పట్టవచ్చని పలువురు సినీ ప్రముఖులు కామెంట్ చేస్తున్నారు.
ఇక బాలీవుడ్ సీనియర్ దర్శకుడు శేఖర్ కపూర్ కూడా ఎవరు ఊహించని విధంగా స్పందించారు. ‘ఏడాది పాటు థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి మొదటి వారాలలో 100+ కోట్ల బిజినెస్ అనేది చచ్చిపోయింది. థియేట్రికల్ స్టార్ సిస్టమ్ కూడా చనిపోయింది. ఇక స్టార్స్ అందుబాటులో ఉన్న OTT ప్లాట్‌ఫామ్‌కి వెళ్లాలి.. లేదా వారి సొంత యాప్ ల ద్వారా సినిమాలను ప్రసారం చేయాలి. టెక్నాలజీని సింపుల్ గా వాడుకోవాలి’ అని వివరణ ఇచ్చారు.