బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, ఇద్దరు మిత్రులు, మృగరాజు, అన్నయ్య, ఇంద్ర, ఠాగూర్, అంజి, జై చిరంజీవ, స్టాలిన్… మెగాస్టార్ నటించిన ఈ లిస్ట్ లో హిట్స్, సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్, ఆఖరికి ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్, ఇవన్నీ మ్యూజికల్ హిట్స్ అవడమే. పైన చెప్పిన 10 సినిమాల్లోని పాటలు ఇప్పటికీ అప్పుడప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. చిరు ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ లిస్ట్ తీస్తే అందులో ఈ సినిమాలు తప్పకుండా ఉంటాయి. ఈ లిస్ట్ లో సినిమా సినిమాకి దర్శకుడు మారిండోచ్చు, ప్రొడ్యూసర్ మారిండోచ్చు కానీ మారని విషయం ఏదైనా ఉందా అది మ్యూజిక్ డైరెక్టర్. అవును, పైన చెప్పిన ప్రతి మూవీకి మ్యూజిక్ ఇచ్చింది మణిశర్మనే.
చిరుకి చాలా సార్లు కెరీర్ బెస్ట్ సాంగ్స్ ఇచ్చిన మణిశర్మ, మెగాస్టార్ కి అదిరిపోయే బీజీఎమ్స్ కూడా ఇచ్చాడు. ఒక పర్టికులర్ టైములో చిరంజీవి సినిమా అంటే అందులో మణిశర్మ మ్యూజిక్ తప్పకుండా ఉండాల్సిందే. అంతలా మెగా అభిమానులని అలరించిన ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చిరు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ కోసం చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ని ట్రై చేసిన శివ, మణిశర్మ అయితే బాగుంటుంది భావిస్తున్నాడట. స్టాలిన్ తర్వాత చిరు మణిశర్మ కాంబినేషన్ లో సినిమా రాలేదు. 13 ఏళ్ల తర్వాత ఒక జనరేషన్ నే కదిలించిన ఈ హిట్ కాంబినేషన్ కన్ఫర్మ్ అవుతుందా లేదా తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.