ఇప్పుడంటే ప్రతి హాలీవుడ్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని కొల్లగొట్టడానికి మన దెగ్గర కూడా రిలీజ్ అవుతున్నాయి కానీ ఇప్పుడొచ్చే సినిమాల కన్నా దశాబ్దాల ముందే మన బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా టైటానిక్. 1997లో వచ్చిన ఈ మూవీ ఇండియా వైడ్ అప్పట్లోనే 65కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఏ రీజినల్ లాంగ్వేజ్ లోకి డబ్ కాకుండా స్ట్రెయిట్ ఇంగ్లీష్ లో మాత్రమే ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆ స్థాయి వసూళ్లు రాబట్టిన టైటానిక్, అదే ఇప్పట్లో అయి ఉంటే ఈ లెక్క వందల కోట్లలో ఉండేది.
ఏళ్లుగా గడుస్తున్నా ఎన్ని సినిమాలు వస్తున్నా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర టైటానిక్ సాధించిన ఫీట్ ని మాత్రం టచ్ చేయలేకపోయాయి. 22 ఏళ్ల తర్వాత జోకర్ సినిమా ఈ రికార్డులని బ్రేక్ చేసింది. ఏ లాంగ్వేజ్ లో డబ్ అవ్వకుండా కేవలం ఇంగ్లీష్ లోనే రిలీజ్ అయిన జోకర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సైరా వార్ లాంటి సినిమా పోటీగా ఉన్నా 700 థియేటర్స్ లో రిలీజ్ అయిన జోకర్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 981 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఇందులో ఇండియా నుంచే 70 కోట్లు ఉండడం విశేషం. దాదాపు అయిదు కోట్ల డిఫరెన్స్ తో జోకర్, టైటానిక్ ని బీట్ చేసింది. రెండు దశాబ్దాల తర్వాత టైటానిక్ రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి, మరి జోకర్ రికార్డ్స్ బ్రేక్ అవ్వడానికి ఎన్ని ఏళ్లు పడుతుందో చూడాలి.