బేస్ వాయిస్ తో భల్లాలదేవుడు పాట అందుకుంటే అదిరిపోద్ది

భళ్లాలదేవుడిగా విలనిజంని అద్భుతంగా ప్రెజెంట్ చేసిన రానా దగ్గుబాటి, అప్పుడప్పుడూ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. స్టేజ్ లపై కవితలని కలుపుతు స్పీచ్ లు కూడా ఇస్తూ ఉంటాడు. ఈసారి మాత్రం సాంగ్ పడడానికి గొంతు సవరించుకుంటున్నాడు. రానా అనగానే అదిరిపోయే బేస్ వాయిస్ గుర్తొస్తుంది, అలాంటిది సాంగ్ పడితే ఎలా ఉంటుంది. యాక్షన్ సినిమాలో చూస్తే తెలుస్తుంది.

విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యాక్షన్, త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీకి హిప్ హాఫ్ తమిళ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగులో కూడా యాక్షన్ పేరుతోనే రిలీజ్ కానున్న ఈ మూవీలో రానా లైట్స్‌, కెమెరా, యాక్షన్‌.. అనే పాటను పాడాడు. ఈ విషయాన్నీ హిప్ హాప్ తమిళ అనౌన్స్ చేస్తూ ట్వీట్ చేశాడు. హిప్ హాప్ తమిళ ట్వీట్ కి రానా “నువ్వు లేకుంటే ఈ సాహ‌సం చేసేవాడిని కాను“ అంటూ రిప్ల‌య్ ఇచ్చాడు. మరి రానా పాట ఎలా ఉంటుంది, అది సినిమాకి ఎంత హెల్ప్ అవుతుంది అనేది తెలియాలి అంటే న‌వంబ‌ర్ 15 వరకూ ఆగాల్సిందే.