ఈరోజు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా… మాటల మాంత్రికుడికి డేడికేట్ చేస్తూ ఒక స్పెషల్ ఆర్టికల్
ఒక వ్యక్తికి సమూహాన్ని కదిలించే శక్తి ఉంటుందని తెలియదు, త్రివిక్రమ్ ని చూసే వరకూ. ఒక మాట మనిషిని ప్రేరేపిస్తుందని తెలియదు మాటల మాంత్రికుడి కలం పదును చూసే వరకూ. న్యూక్లియర్ ఫిజిక్స్ చదివిన వ్యక్తి, యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి సినిమాల్లోకి వస్తాడనే ఎవరూ ఊహించి ఉండరు అలాంటిది ఇంతమందిని తెలుగు ప్రేక్షకులని అలరిస్తాడని ఎవరు ఊహిస్తారు. త్రివిక్రమ్ నవ్వు ప్రశాంతతని ఇస్తుంది, అతని ప్రతి మాటలో ఎంతో జ్ఞానం కనిపిస్తుంది… అందుకే పేజీలకి పేజీలు మాట్లాడే చోట త్రివిక్రమ్ ఒక్క మాటతోనే సమాధానం చెప్పగలడు. ఎన్ని పురాణాలు చదివినా అర్ధం కానీ విషయాన్ని మాటల మాంత్రికుడు సింపుల్ గా అర్ధం అయ్యేలా చెప్పగలడు.
శిష్యరికం తీసుకోలేదు, ఎవరికీ పాఠాలు చెప్పలేదు, నీతులూ నేర్పలేదు అయినా త్రివిక్రమ్ ని ప్రతి ఒక్కరూ గురూజీ అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. ఎందుకంటే మాటల మాంత్రికుడు ఎన్నోసార్లు జీవిత సత్యాలు చెప్పాడు, సినిమాల ద్వారా ఎలా జీవించాలో చెప్పాడు. త్రివిక్రమ్ స్టైల్ లోనే చెప్పాలి అంటే… అక్షరాలని ఆయుధంగా చేసుకోని, సన్నివేశాన్ని యుద్ధం భూమిగా మార్చుకోని, యాక్టర్స్ నే సైనికులుగా మలుచుకొని… వారితో త్రివిక్రమ్ యుద్దానికి వెళ్తాడు, అలుపెరగని యుద్ధం చేస్తూనే ఉంటాడు.
చివరిగా… త్రివిక్రమ్ మన తెలుగు చిత్ర పరిశ్రమ విషయంలో జరిగిన అద్భుతం, అది జరిగక ముందు ఎవరూ గుర్తించరు, జరిగిన తర్వాత ఇప్పుడు ఎవరూ గుర్తించాల్సిన అవసరమూ లేదు. ఆయన కలం నుంచి వచ్చే అక్షరాలని మనకి అన్వయించుకుంటూ ఆస్వాదించడమే.