ఆఫీసర్ ఆదిత్య అరుణాచలంగా సూపర్ స్టార్ రజినీకాంత్…

సూపర్ స్టార్ రజినీకాంత్ పేరుతో, దర్బార్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో సునామీ వచ్చింది. తెలుగు తమిళ్ హిందీ మలయాళం అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాలకి అది వ్యాపించింది. మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ని స్టార్ హీరోస్ రిలీజ్ చేశారు. అనిరుద్ అదిరిపోయే మ్యూజిక్ కంపోజ్ చేస్తే, ఆదిత్య అరుణాచలంగా పోలీస్ డ్రెస్ లో సూపర్ స్టార్ ఎంట్రీ ప్రతి తలైవా అభిమానితో విజిల్స్ వేయించేలా ఉంది.

పోలీస్ యూనిఫామ్, చేతిలో కత్తి, బ్లాక్ గాగ్స్ తో ఒక ఓల్డ్ ఫ్యాక్టరీలో వచ్చే ఫైట్ సీన్ నుంచి డిజైన్ చేసిన ఈ పోస్టర్ సింప్లీ సూపర్బ్. ముఖ్యంగా తలైవా అన్న బీజీఎమ్ రాగానే ఫేస్ పై స్మైల్ తో, చైర్ లో దర్జాగా కూర్చున్న రజినీ, స్టైల్ ఐకాన్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించాడు. వయసుతో సంబంధం లేకుండా మెస్మరైజ్ చేసే రజినీ స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. మొత్తానికి మోషన్ పోస్టర్ తో ప్రొమోషన్స్ మొదలుపెట్టిన మురుగదాస్ అండ్ టీం భారీ హైప్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాకే పరిమితం అయిన దర్బార్ సునామి, సంక్రాంతికి థియేటర్స్ కి తాకనుంది.