తలైవా రజనీకాంత్‌కి ఓ అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ఇండియా(ఐ ఎఫ్ ఎఫ్ ఐ) 50వ వార్షికోత్సవం సందర్భంగా రజినీని స్పెషల్ ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు తో సత్కరించనుంది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తన ట్విట్టర్ కాత ద్వారా ఈ రోజు ప్రకటించారు. ఈనెల 20 నుండి 28వరకు జరగనున్న ఈ వేడుకలో సూపర్ స్టార్ ఈ అవార్డును అందుకోనున్నారు.
రజినీకాంత్ ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దర్బార్ చిత్ర నిర్మాణ కార్యక్రమాలలో బిజీగా వున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 15న విడుదలకు సిద్ధం కానుంది.