కార్తీ ‘ఖైది’ని మెచ్చుకున్న సూపర్ స్టార్

khaidi movie

యాంగ్రీ హీరో కార్తీ నటించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’ దీపావళి బ్లాక్ బస్టర్ గా సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఖైదీ ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ” న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్ తో ఖైదీ చాలా బాగుంది. ఆకట్టుకునే స్క్రిప్ట్, థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ తో పాటు నటులు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇటువంటి సబ్జెక్ట్ లో పాటలు లేకపోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. టీమ్ కి నా అభినందనలు ’ అంటూ పోస్ట్ చేసారు మహేష్.

సూపర్ స్టార్ మహేష్ బాబు కి హీరో కార్తీ, దర్శకుడు లోకేష్, నిర్మాతలు ఎస్ ఆర్ ప్రభు, కె కె రాధామోహన్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో సమర్పించిన శ్రీ సత్య సాయి ఆర్ట్స్ కె కె రాధామోహన్ ఖైదీ చిత్రానికి ప్రశంసలు అందించిన మహేష్ బాబు కి కృతజ్ఞతలు చెప్తూ సినిమా అన్ని కేంద్రాల్లో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోందని ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేసారు.