ఈ జనరేషన్ మాస్ హీరోస్ అనే పదానికి పర్ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ ఇద్దరు హీరోల సినిమాలు విడివిడిగా వస్తేనే బాక్సాఫీస్ షేక్ అవుతది, అలాంటిది కలిసి వస్తే ఎలా ఉంటుంది? వీరికి దర్శక ధీరుడు రాజమౌళి కూడా కలిస్తే ఇంకెలా ఉంటుంది? ఈ ఆలోచనలకి సమాధానమే ఆర్ ఆర్ ఆర్. జక్కన్న చెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమా జులై 30 2020న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. రామ్ చరణ్ అల్లూరి సీత రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపించనున్న ఈ సినిమాకి అన్ని భాషల్లో ఆర్ ఆర్ ఆర్ కామన్ గా ఉంటుందని రాజమౌళి ఇప్పటికే చెప్పాడు. అయితే ఈ ఆర్ ఆర్ ఆర్ కి ప్రతి భాషలో ఎక్స్పెన్షన్స్ ఉంటాయని, టైటిల్ కూడా మీరే చెప్పండి అని అభిమానులకి మేకర్స్ ఒక మైండ్ గేమ్ కూడా పెట్టారు.
చాలా టైటిల్స్ బయటకి వచ్చాయి కానీ ‘రామ రౌద్ర రుషితం’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రామ రౌద్ర రుషితం టైటిల్ ని తెలుగు వరకే ఉంచి, మిగిలిన భాషల్లో ‘రైజ్ రివోల్డ్ రివేంజ్’ అనే పేరును కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 22న కొమరం భీం జయంతి సందర్భంగా ట్రిపుల్ ఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని అంతా అనుకుంటున్నారు, అదే రోజున టైటిల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎప్పటిలాగే కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత చాలా సినిమాలు ఆ రికార్డులని టచ్ చేయడానికి ట్రై చేశాయి కానీ అవేమి బాహుబలి రికార్డులని టచ్ కూడా చేయలేకపోయాయి. జులై 30 2020న ఆ రికార్డులు తిరగరాయబడతాయేమో చూడాలి.