ఆమెకు హృతిక్ తో పిల్లలని కనాలని ఉందట

టైగర్ ష్రాఫ్, హృతిక్ కలిసి నటించిన ఫస్ట్ మూవీ వార్, అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా నార్త్ తో భారీ వసూళ్లు రాబడుతోంది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 150 కోట్ల క్లబ్ కి చేరువలో ఉన్న ఈ మూవీ చూసిన వాళ్లందరూ హాలీవుడ్ రేంజులో ఉంది అంటున్నారు. ముఖ్యంగా హృతిక్ రోషన్ ని చూసిన వాళ్లు మాత్రం బాలీవుడ్ లో అంతటి గ్లామర్ హీరో మరొకరు లేడు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సినీ అభిమానులందరినీ మెప్పించిన హృతిక్, తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఒక క్రికెటర్ ని కూడా ఫిదా చేశాడు.

female cricketer hrithik roshan

తమిళనాడుకు చెందిన మహిళా క్రికెటర్ హృతిక్ రోషన్ కు ఫ్యాన్. హృతిక్ ప్రతి సినిమాని ఫాలో అయ్యే ఈ మహిళా క్రికెటర్, రీసెంట్ గా వచ్చిన వార్ సినిమాని కూడా చూసింది. అందరిలాగే సినిమా చూసి జస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తే అందులో న్యూస్ ఏముంటుంది, కాస్త డిఫరెంట్ గా అలోచించి హృతిక్ రోషన్ తో పిల్లలు కనాలని ఉందని, అందుకు హృతిక్ రోషన్ వీర్యదానం చేయాలని ట్విట్టర్ ద్వారా హృతిక్ కు విన్నవించింది. క్రికెటర్ భావన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.