మజిలీ’, ‘ఓ బేబీ’ చిత్రాలు సక్సెస్ అయినా ఇప్పుడు అక్కినేని కోడలు సమంత డైరీ ఎందుకు ఖాళీగా ఉంది? సమంత కొత్తగా ఏ ప్రాజెక్టులకు ఎందుకు సైన్ చెయ్యట్లేదు? పిల్లల కోసమే విరామం తీసుకుందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సమంత, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకుండా ఆచితూచి సెలెక్టివ్ ప్రాజెక్ట్స్ మాత్రమే చేయడానికి వెనుక ఓ బలమైన కారణముంది అదేటంటే…
వరుసగా సినిమాలు చేసి లిస్టు పెంచుకోవాలన్న ఆశ సమంతకు లేదు. తక్కువ చేసినా ప్రేక్షకుల మదిలో కలకాలం గుర్తుండిపోయే మంచి చిత్రాలనే చేయాలని సమంత ప్లాన్. సరైన కథ అయితేనే సినిమాలకు అంగీకరిస్తోంది. అందుకే మూవీలు తగ్గించిందని భర్త నాగచైతన్య క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్ గా మంచు లక్ష్మీ టాక్ షోలో పాల్గొన్న సమంత కెరీర్ పై క్లారిఫై ఇచ్చింది. పిల్లలు పుట్టాక సినీకెరీర్‌కు బ్రేక్ ఇస్తావా? అని మంచు లక్ష్మీ టాక్ షోలో సమంతను ప్రశ్నించింది. పిల్లలు పుట్టాక సినీ కెరీర్‌కు విరామం తప్పకుండా ప్రకటిస్తానని, అయితే అది పూర్తిగా కాదని, కొన్నాళ్ల పాటు మాత్రమేనని సమంత బదులిచ్చింది. పిల్లలు కాస్త పెద్దయ్యే వరకూ కచ్చితంగా మళ్లీ సినిమాలు చేసుకుంటా అని సమంత జవాబిచ్చింది. తమకు ఒక్క బిడ్డ చాలనుకుంటున్నట్లు చెప్పింది. సో చై ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి, సమంత క్లారిటీ ఇచ్చేసింది. మరి అక్కినేని నాలుగో తరం వచ్చేది ఎప్పుడో, అక్కినేని అభిమానులు ఆ శుభవార్త వినేదెప్పుడో చూడాలి.