త్వరలో ప్రారంభం కాదన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర షూటింగ్

హరి శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల జంటగా నటించబోతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై రానున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత నిర్మించుగా నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరించరున్నారు. గతంలో గబ్బర్ సింగ్ చిత్రానికి పవన్ కళ్యాణ్ ఇంకా హరీష్ శంకర్ మరోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ కావడంతో అభిమానులు ఎన్నో ఆశలతో ఈ చిత్రం కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల వల్ల కాస్త బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సినిమాలకు వరుసగా డేట్లు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను వెండితెరపై చూసి సుమారు సంవత్సరం పైగా కావడంతో అభిమానులు ఆయన సినిమాల కోసం ఎంతకనో వేచిచూస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 12వ తేదీన హరి హర వీరమల్లు వెండి ధరపై రానుండగా రోజు చిత్రం కోసం కొన్ని డేట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఎన్నో రోజుల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర కథను ఓకే చేసిన పవన్ కళ్యాణ్ అతి త్వరలో ఈ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నట్లు చిత్ర బృందం నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఒక పోస్టర్ను విడుదల చేస్తూ పండుగ శుభాకాంక్షలు తో పాటు ఈ వార్తను తెలియజేశారు. దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులు త్వరలోనే పవన్ కళ్యాణ్ చిత్రాలు వరుసగా రానున్నయి అంటూ తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.