
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ యజమానులు (ఎగ్జిబిటర్లు) కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 65 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. సమావేశంలో అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మరియు ప్రొడ్యూసర్ గిల్డ్‌లకు తెలియజేయనుంది. అయితే, ప్రొడ్యూసర్లు తమకు సహకరించకపోతే, జూన్ 1 నుంచి సినిమా థియేటర్లను బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు.
ఈ నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. పరిశ్రమలోని వివిధ వర్గాలు ఈ సమస్యపై చర్చలు జరపాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.