
తమిళ సినీ నటుడు విశాల్‌కు అస్వస్థత కారణంగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో జరిగిన మిస్ కూవాగం ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కాంటెస్ట్‌లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న విశాల్, వేదికపై ఉండగా ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలిపోయారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వెంటనే నిర్వాహకులు అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత విశాల్ కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఆస్పత్రి నుంచి అధికారిక వైద్య బులెటిన్ ఇంకా విడుదల కానప్పటికీ, వేసవి వేడిమి కారణంగా అతను అలసట లేదా డీహైడ్రేషన్‌కు గురై ఉండవచ్చని భావిస్తున్నారు. అభిమానులు సోషల్ మీడియాలో విశాల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సందేశాలు పంచుకుంటున్నారు.