హీరోగా ఫుల్ స్వింగ్ లో ఉన్న నాని, అప్పుడప్పుడు ప్రొడ్యూస్ కూడా చేస్తుంటాడు. రీసెంట్ గా ఆ! సినిమాని ప్రొడ్యూస్ చేసిన నాని మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి నాని ప్రొడ్యూసర్ అవతారమెత్తనున్నాడు. ఫలక్‌నుమాదాస్ సినిమాతో హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా మల్టిపుల్ రోల్స్ చేసి సక్సస్ అందుకున్న విశ్వక్సేన్ ని హీరోగా పెట్టి నాని ఒక మూవీ ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఫలక్‌నుమాదాస్ తర్వాత విశ్వక్ సేన్ ఏ సినిమా చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సినిమా సోను కే టిటుకి స్వీటీని తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అయిన విశ్వక్ సేన్, నెక్స్ట్ నాని బ్యానర్ లో సినిమా చేయనున్నాడు. రీసెంట్ గా నాని, విశ్వక్ సేన్ కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నారని, మిగిలిన విషయాలు ఫైనలైజ్ కావడానికి కాస్త సమయం పడుతుందని సమాచారం. అయితే తను స్వతహాగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న నాని, యంగ్ హీరోలని పెట్టి కథాబలం ఉన్న సినిమాలని నిర్మించడం మంచి పరిణామం. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకి రానుంది.