‘దిల్ రూబా’ చిత్ర రివ్యూ

కిరణ్ అబ్బవరం, రుక్షర్ దిల్లోన్ జంటగా విశ్వకరుణ్ తొలిదర్శకత్వంలో శవం సెల్లులోయిడ్స్ బ్యానర్ పై రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సరిగమప నిర్మాతలుగా వ్యవహరిస్తూ శ్యామ్ సిఎస్ సంగీత దర్శకునిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం దిల్ రూబా. ఈ చిత్రంలో ఖ్యాతి దవిసన్ మరో కీలక పాత్ర పోషించగా సత్య, జాన్ విజయ్, దయానంద రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి 14వ తేదీన హోలీ సందర్భంగా ప్రేక్షకులు ముందుకు ఈ చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి డానియల్ విశ్వాస్ సినిమాగా పనిచేస్తారు. ఇక ఈ చిత్ర రివ్యూకి వస్తే…

కథ:
ఈ చిత్రంలో హీరోగా నటించిన కిరణ్ అబ్బవరంకు సారీ ఇంకా థాంక్స్ అని రెండు పదాలు చాలా విలువైనవి. అందుకే ఆ పదాలను ఉపయోగించాడు. దానికి గల కారణం తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు. అయితే రుక్షర్ కు తనతో ప్రేమలో ఉండగా వారికి కొన్ని సమస్యలు వస్తాయి. అసలు ఆ సమస్యలు ఎటువంటివి, ఎందుకు వచ్చాయి? దానికి గల కారణం ఎవరు? వారి జీవితాల్లోకి జాన్ విజయ్ ఎలా వస్తారు? కిరణ్ అబ్బవరం సారి ఇంకా థాంక్స్ పదాలు ఆ పరిస్థితులలో వాడతాడా లేదా? విడిపోయిన వారిద్దరి మధ్యకు కిరణ్ అబ్బవరం ఎక్స్ వచ్చి ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది? చివరికి వాడు కలుస్తారా లేదా? అనే విషయం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రం చూడాల్సిందే.

నటీనటుల నటన:
ఈ చిత్రంలో హీరో హీరోయిన్ కనిపించిన కిరణ్ అబ్బవరం ఇంకా రుక్షర్ ఎంతో బాగా నటించారు. క సినిమాతోనే నట విశ్వరూపం చూశారు ప్రేక్షకులు. ఈ చిత్రం ప్రేమ కథ చిత్రం కావడంతో అంతటి యాక్షన్ ఉండకుండా మంచి ఫ్లోలో వెళ్లే నటుడును కిరణ్ లో చూడగలము. అదేవిధంగా రుక్షర్ ఇంకా కథీ తమ పాత్రలకు తగ్గట్లు పూజిస్తూ మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. చిత్రంలో నటించిన సత్య తన కామిడీ టైమింగ్స్ తో మంచి కామెడీని పండించాడు. అలాగే జాన్ విజయ్ ఇంకా దయానంద్ తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

సాంకేతిక విశ్లేషణ:
కేవలం లవ్ లైన్ పై తీసుకుని వెళ్లాలనుకున్నప్పుడు చిత్రంలో ఎంతో ఇంటెన్సిటీ ఇంకా చిత్రం ప్రేక్షకులకు ఎంతో కనెక్ట్ అయ్యే విధంగా ఉండేలా చూసుకోవాలి. మంచి లైన్ పట్టుకున్నప్పటికి ఆ లైన్ ఎక్స్టెండ్ చేసి తనపై ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడు ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. హీరో ఇంకా హీరోయిన్లు కానీ లేదా ఇతర నటీనటుల క్యారెక్టర్జేషన్లో ఎంతో డెప్త్ ఉంటే తప్పించి కేవలం లవ్ లైన్ పై ప్రేక్షకులు ఎక్కువ సేపు సినిమాను చూడలేరు. కానీ కిరణ అబ్బవరం క్యారెక్టర్ తోనే చిత్రం మొత్తం చూడాలంటే కష్టమని చెప్పుకోవాలి. ఆ విషయంలో దర్శకుడు మరోసారి ఆలోచించుకుని ఉండాల్సింది. సినిమాకు మంచి సంగీత దర్శకుడు పని చేసినప్పటికీ సీనులకు తగ్గట్లు ఆ బిజిఎం కూడా సెట్ కాలేదు. శ్యామ్ సీఎస్ అంటే సంగీతంపై కచ్చితంగా మంచి ఔట్పుట్ వస్తుందని పెట్టుకోవచ్చు కానీ ఈ చిత్రంలో పాటలు బాగున్నప్పటికీ బిజిఎం సెట్ కాలేదు. హీరో క్యారెక్టర్ తప్పించి కనెక్ట్ అయ్యే విధంగా చిత్రంలో ఏమీ లేకపోవడం చిత్రానికి పెద్ద డ్రాబ్యాక్ అయింది. అభిమానులను పూర్తిగా నిరాశపరిచే విధంగా కిరణ్ అబ్బవరం సినిమా ఉండటం షాకింగ్ అనుకోవచ్చు. సినిమాలో డైలాగ్స్ ఇంకా కాస్ట్యూమ్స్, లొకేషన్స్ బాగున్నప్పటికీ కథలో దమ్ము లేకపోవడం వల్ల సినిమా నిలబడటం కష్టం అని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, కాస్ట్యూమ్స్, లొకేషన్స్, డైలాగ్స్, పాటలు

మైనస్ పాయింట్స్:
కథ, దర్శకత్వం, బిజిఎం

సారాంశం:
దిల్ రూబా చిత్రంపై అభిమానులు ఇంకా ప్రేక్షకులు ఎటువంటి అంచనా లేకుండా వెళ్తే కొంతవరకు సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే దిల్ రూబా ప్రేక్షకులను నిరాశపరిచేలా ఉంది.