ఘనంగా కిరణ్ అబ్బవరం “దిల్ రూబా” ప్రీ రిలీజ్ ఈవెంట్

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “దిల్ రూబా”. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. “దిల్ రూబా” సినిమా ఈనెల 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ మాట్లాడుతూ – “దిల్ రూబా” ఒక యూత్ ఫుల్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్. రెండేళ్లపాటు ఈ సినిమా కోసం ప్యాషనేట్ గా కష్టపడ్డాం. ఒక యంగ్ టీమ్ ప్యాషనేట్ గా కష్టపడితే సినిమా ఎంత బాగా వస్తుందనేందుకు “దిల్ రూబా”నే ఎగ్జాంపుల్. అన్నారు.

డీవోపీ డేనియల్ విశ్వాస్ మాట్లాడుతూ – “దిల్ రూబా” చిత్రంలో పనిచేసిన ఆవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ రవి గారికి, సారెగమాకు థ్యాంక్స్. ఈ సినిమాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా గట్టిగా నిలబడింది ప్రొడ్యూసర్ రవిగారు. ఆయనకు సినిమా అంటే ప్యాషన్. హీరో కిరణ్ గారితో నేను ఎస్ఆర్ కల్యాణమండపం, క సినిమాలు చేశాను. ఆ రెండూ సక్సెస్ అయ్యాయి. ఈ థర్డ్ ఫిలిం “దిల్ రూబా” కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

కొరియోగ్రాఫర్ జితు మాట్లాడుతూ – నేను కిరణ్ గారికి చేసిన ఫస్ట్ మూవీ “దిల్ రూబా”. ఈ చిత్రంలో అగ్గిపుల్లె సాంగ్ కు కొరియోగ్రఫీ చేశాను. మాస్టర్ మీ డ్యాన్సింగ్ స్టైల్ బాగుంటుంది. మీరు ఎలాంటి స్టెప్స్ ఇచ్చినా చేస్తాను అని కిరణ్ గారు ఎంకరేజింగ్ గా చెప్పేవారు. ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ కు థ్యాంక్స్. అన్నారు.

కొరియోగ్రాఫర్ ఈశ్వర్ పెంటి మాట్లాడుతూ – “దిల్ రూబా” సినిమాలో హే జింగిలీ పాటకు కొరియోగ్రాఫ్ చేశాను. ఈ పాటలో కిరణ్ గారు, రుక్సర్ డ్యాన్సింగ్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఈ పాట చేసే అవకాశం ఇచ్చిన మా జూనియర్ పూరి జగన్నాథ్ మా డైరెక్టర్ విశ్వకరుణ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ – “దిల్ రూబా”కు ఈ టీమ్ ఎంతో కష్టపడ్డారు. కిరణ్ అన్నతో సహా మీ అందరి కష్టం మంచి రిజల్ట్ ఇస్తుందని నమ్ముతున్నా. సమ్మతమే సినిమా తర్వాత నేను కథలు రాసి ప్రయత్నాలు చేస్తుంటే కిరణ్ అన్న ఎంతో ధైర్యం చెప్పారు. పాజిటివ్ ఆటిట్యూడ్ ఉన్న కిరణ్ అన్నకు మంచే జరుగుతుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ రవి మాట్లాడుతూ – “దిల్ రూబా” సినిమా విజయంపై మేమంతా పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఎంతోమంది ఈ సినిమా రిలీజ్ చేస్తామని వచ్చినా మేమే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నాం. కిరణ్ గారు మాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేం. అందరూ సినిమా రిలీజ్ అయ్యాక ఆ రోజు సాయంత్రం సక్సెస్ మీట్ పెడతారు. మేము ఈ నెల 14న మార్నింగ్ షో అయిన వెంటనే సక్సెస్ మీట్ పెట్టబోతున్నాం. మీకు ఈ చిత్రంలో కిరణ్ గారు చేసిన ఫైట్స్, డ్యాన్సులు విజిల్స్ వేయిస్తాయి. ఈ జర్నీలో నా ఫ్రెండ్స్ ఎంతోమంది నాకు అండగా నిలబడ్డారు. సారెగమా నుంచి ఎంతో సహకారం అందింది. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ ఇది తమ సినిమా అనుకుని కష్టపడ్డారు. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ – “దిల్ రూబా” సినిమా ప్రీ రిలీజ్ కు వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా విషయంలో కిరణ్ గారు మా కంటే ఎక్కువగా కథను, దర్శకుడినీ నమ్మారు. కథను, డైరెక్టర్ ను నమ్మిన ప్రతి హీరోకు సక్సెస్ తప్పకుండా వస్తుంది. “దిల్ రూబా”తో కిరణ్ గారికి, మా టీమ్ అందరికీ విజయం దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ క్యాతీ డేవిసన్ మాట్లాడుతూ – లైఫ్ లో మ్యాజిక్ ఒక్కసారే జరుగుతుంది. నా కెరీర్ విషయంలో ఆ మ్యాజిక్ “దిల్ రూబా” సినిమాతో జరిగింది. ఈ చిత్రంలో మ్యాగీ క్యారెక్టర్ లో నటించాను. ఇలాంటి మంచి క్యారెక్టర్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. కిరణ్ గారు కోస్టార్ గా ఎంతో సపోర్ట్ చేశారు. ఈ నెల 14న థియేటర్స్ లో మా “దిల్ రూబా” సినిమా చూసి మీ రెస్పాన్స్ చెప్పండి. అన్నారు.

యాక్టర్ జాన్ విజయ్ మాట్లాడుతూ – “దిల్ రూబా” సినిమాలో విలన్ గా నటించాను. నేను గతంలో చేసిన విలన్ క్యారెక్టర్స్ కు డిఫరెంట్ గా ఈ చిత్రంలో డైరెక్టర్ విశ్వకరుణ్ చూపించారు. విలన్ గా కొత్తగా కనిపిస్తాను. కిరణ్ వంటి టాలెంటెడ్ హీరోతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. అన్నారు.

హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ – “దిల్ రూబా” సినిమాలో అంజలి క్యారెక్టర్ లో నటించాను. అంజలి క్యారెక్టర్ ఎనర్జిటిగ్ గా ఉంటూనే ఎంతో ఎమోషనల్ డ్రైవ్ తో సాగుతుంది. డెప్త్ ఉన్న డైలాగ్స్ నాతో చెప్పించారు దర్శకుడు విశ్వ కరుణ్ గారు. ఇలాంటి పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. కో స్టార్ గా కిరణ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. మా టీమ్ అందించిన సహకారం మర్చిపోలేనిది. నా కృష్ణార్జున, అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలను మీరంతా ఆదరించారు. అలాగే “దిల్ రూబా” చిత్రాన్ని కూడా ఈ నెల 14న థియేటర్స్ లో చూసి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ విశ్వకరుణ్ మాట్లాడుతూ – “దిల్ రూబా” సినిమా ఇంత గ్రాండ్ గా మీ ముందుకు వస్తోందంటే దాని వెనక మా టీమ్ లోని ప్రతి ఒక్కరి ఎఫర్ట్స్ ఉన్నాయి. వారు ప్యాషన్ గా వర్క్ చేయడం వల్లే ఇంతమంచి ఔట్ పుట్ వచ్చింది. నేను థియేటర్ లో చూసి ఇన్స్ పైర్ అయిన ఫస్ట్ హీరో చిరంజీవి గారు, నేను డైరెక్షన్ చేసిన ఫస్ట్ హీరో కిరణ్ గారు. వీళ్లిద్దరినీ నా లైఫ్ లో మర్చిపోలేను. నేను రైటర్ నుంచి డైరెక్షన్ వైపు ట్రయల్స్ చేస్తుంటే కిరణ్ గారు ఫస్ట్ కథ విన్నారు. ఆయన ఆ తర్వాత సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ వెళ్తుంటే పెద్ద బ్యానర్స్ ఆఫర్స్ వచ్చాయి. అప్పుడు నా మూవీ ఉండదేమో అని భయపడ్డా కానీ కిరణ్ గారు పిలిచి నేను మాటిస్తే తప్పకుండా సినిమా చేస్తా నువ్వు టెన్షన్ పడకు అన్నారు. అలాగే ఇప్పటిదాకా నాతో ట్రావెల్ చేస్తూ మూవీ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. కిరణ్ గారు ఈ సినిమాలో చేసిన ఫైట్స్, చెప్పే డైలాగ్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఆయన కోసం నేను ఇంకా మంచి డైలాగ్స్ రాసేందుకు రెడీ. రీసెంట్ గా “దిల్ రూబా” సినిమా చూసి కిరణ్ గారు టెన్షన్ పడకు సినిమా అదిరిపోయింది అన్నారు. అదే నమ్మకంతో చెబుతున్నా ఈ నెల 14న థియేటర్స్ కు వెళ్లండి. ఒక కొత్త కిరణ్ అబ్బవరంను స్క్రీన్ మీద చూస్తారు. అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – “దిల్ రూబా” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన గెస్ట్ లు, మీడియా మిత్రులు, నా ఫ్యాన్స్ కు నమస్కారం. నా ప్రతి సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్, డీవోపీ డేనియల్ విశ్వాస్ తప్పకుండా ఉంటారు. వీళ్లు ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. “దిల్ రూబా”కు సామ్ సీఎస్ గారు ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. ఆయన మ్యూజిక్ కోసమైనా మీరు “దిల్ రూబా” చూడాలి. మా మూవీతో సారెగమా వారు అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఐదేళ్లవుతోంది. పది సినిమాలు చేశాను. కిరణ్ కష్టపడుతున్నాడు అని మీరంతా నా సినిమాల పట్ల ఆదరణ చూపిస్తున్నారు. ఇదే ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా. నా మొదటి సినిమా రిలీజ్ కాకముందే పది మంది కిరణ్ అన్న అభిమానులం అని నా వెంట ఉండేవారు. ఇప్పుడా పది మంది వందలు, వేలు అయ్యారు. నా ఫ్యాన్స్ గురించి మాట్లాడాలంటే ఎమోషన్ అవుతాను. మీ అభిమానం కాపాడుకుంటూ గర్వపడేలా సినిమాలు చేస్తానని చెబుతున్నా. సినిమా ఇండస్ట్రీలోకి హోప్ తో వచ్చే ఎంతోమంది ఇక్కడి కష్టాలు పడలేక తిరిగి వెళ్లిపోవడం చూశా. కానీ మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా మీరూ నాలాగ సంతోషంగా ఉండే రోజు వస్తుంది. ఊర్ల నుంచి సినిమా మీద ప్యాషన్ తో వచ్చేవారిలో ఓ పదిమందికి ఏటా నేను సాయం చేస్తా. అది ఫుడ్ కానీ, షెల్టర్ కానీ అవకాశాలు కానీయండి నా వల్ల చేతనైన సాయం వారికి చేస్తా. నేను ఇంకా సక్సెస్ అయితే ఏటా వందమంది ఔత్సాహికులకు సాయం చేయాలనుకుంటున్నా. నా ప్రతి సినిమాలో 40 నుంచి 50 మంది కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నా. ఇకపైనా ఆ ప్రయత్నం కొనసాగిస్తా. మొదట్లో “దిల్ రూబా”ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడిన మాట నిజం. అయితే ఇప్పుడు మా టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ నెల 14న కాదు 13 సాయంత్రమే “దిల్ రూబా” ప్రీమియర్స్ తో మా సక్సెస్ జర్నీ స్టార్ట్ కాబోతోంది. హోలీ పండుగను మా మూవీతో కలిసి థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకోండి. సినిమా 2 గంటల 20 నిమిషాల్లో ఎక్కడా బోర్ ఫీల్ కారు. క సినిమాలో కంటెంట్ చూశారు. “దిల్ రూబా”లో కిరణ్ అబ్బవరంను చూస్తారు. విశ్వకరుణ్ నన్ను సినిమాలో చూపించిన విధానం, నాతో చెప్పించిన డైలాగ్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. వుమెన్ ప్రతి ఒక్కరూ ఈ మూవీకి వెళ్లండి. మీ మీద రెస్పెక్ట్ తో ఈ సినిమా చేశాం. ఫ్యామిలీస్ అంతా “దిల్ రూబా”కు వెళ్లండి. మీరు ఇబ్బందిపడే ఒక్క డైలాగ్, ఒక్క సీన్ కూడా సినిమాలో ఉండదు. ఇంత క్లీన్ గా కమర్షియల్ సినిమా తీయగలరా అని దిల్ రూబా చూశాక మీరే అంటారు. ఇది న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా. సినిమా ఎంత పెద్ద సక్సెస్ అనేది ఇప్పుడే చెప్పలేను కానీ మీ టైమ్ ను వృథా చేయను, మీకు ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీ అని మాత్రం ఇవ్వగలను. అన్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, క్యాతీ డేవిసన్, సత్య, తదితరులు

టెక్నికల్ టీమ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్) & దుడ్డి శ్రీను.
ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్
ఎడిటర్ – ప్రవీణ్.కేఎల్
సినిమాటోగ్రఫీ – డానియేల్ విశ్వాస్
మ్యూజిక్ – సామ్ సీఎస్
నిర్మాతలు – రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్
రచన, దర్శకత్వం – విశ్వ కరుణ్