ఇప్పటి వరకూ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో కలిసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ డైరెక్టర్ శివ. మాస్ ఆడియన్స్ ని ఎలా అట్రాక్ట్ చేయాలో పర్ఫెక్ట్ గా తెలిసిన శివ, ఇప్పుడు సూర్యతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. సూర్య 39వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో నయనతార, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించనున్నారు. నయనతార మెయిన్ ఫిమేల్ లీడ్ గా చేస్తున్న ఈ సినిమాలో, మరో ఇంపార్టెంట్ రోల్ లో కాజల్ అగర్వాల్ కనిపించనుందట. కాజల్ పాత్ర నిడివి తక్కువే అయినా విశ్వాసం సినిమా సమయంలో డైరెక్టర్ శివతో ఏర్పడిన రిలేషన్ కారణంగా అతనిపై నమ్మకంతోనే సూర్య సినిమాలో నటించడానికి కాజల్ ఓకే అనిందని సమాచారం. డి ఇమ్మాన్ మ్యూజిక్ ఇస్తున్న ఈ మూవీని పొంగల్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
సూర్యకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది, దర్శకుడు శివ కూడా తెలుగులో మంచి హిట్స్ అందుకున్నాడు. ఈ ఇద్దరి నుంచి సినిమా వస్తుంది అంటే టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంటుంది. అయితే సంక్రాంతి సందర్భంగా తెలుగులో భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటి మధ్యలో సూర్య తన సినిమాని రిలీజ్ చేసి హిట్ అందుకుంటాడా, అన్ని థియేటర్స్ దొరుకుతాయా అంటే కష్టమనే చెప్పాలి. తెలుగులో మాత్రమే కాదు తమిళ్ లో కూడా సూర్యకి సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. రజినీ, మురుగదాస్ కలయికలో వస్తున్న దర్బార్ సినిమా కూడా సంక్రాంతి కనుకగానే ప్రేక్షకుల ముందుకి రానుంది. డైరెక్టర్ శివకి రజినీపై మంచి మార్కెట్ ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి శివ, అజిత్ తో చేసిన విశ్వాసం సినిమాని చేశాడు. పేట మూవీకి పోటీగా వచ్చిన విశ్వాసం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇదే రికార్డ్ ని కంటిన్యూ చేస్తూ శివ, సూర్య39 సినిమాని కూడా రజినీకి పోటీగా నిలబెట్టాలనుకుంటున్నాడట. అయితే పేట పరిస్థితి వేరు, కథతో సంబంధం లేకుండా కేవలం రజినీ చరిష్మా మీదే తెరకెక్కిన సినిమా అది కానీ దర్బార్ అలా కాదు. మురుగదాస్ లాంటి పక్కా కమర్షియల్ డైరెక్టర్, రజినీని టు షేడ్స్ లో చూపిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. పోలీస్ గా రజినీకాంత్ బాక్సాఫీస్ ని దున్నేస్తాడని ట్రేడ్ వర్గాలు ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నాయి. సో, రజినీ దర్బార్ ని తట్టుకోని సూర్య నిలబడగలడా అనేది అతిపెద్ద ప్రశ్న. ఇంకా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టుకోని ఈ సినిమా రిలీజ్ గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం చాలా తొందర అవుతుంది. పొంగల్ సమయానికి సూర్య రాజీ పడతాడా లేదా అనేది తెలియాలి అంటే అప్పటి వరకూ ఆగాల్సిందే.