సినీ ప్రముఖుల చేత ‘తారకేశ్వరి’ మూవీ పోస్టర్ & ట్రైలర్ లాంచ్

శ్రీ శివ సాయి ఫిలిం బ్యాన‌ర్‌లో డైరెక్ట‌ర్ వెంకట్ రెడ్డి నంది దర్శక నిర్మాణంలో శ్రీకరన్, అనూష, షన్ను హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ మూవీ ‘తారకేశ్వరి’. ఈ చిత్రం పోస్టర్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘ‌నంగా జరిగింది. మూవీ పోస్టర్‌ను నటి కరాటే కళ్యాణి లాంచ్ చేయగా, ట్రైలర్‌ను నటుడు ఘర్షణ శ్రీనివాస్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ, “‘తారకేశ్వరి’ మూవీ ట్రైల‌ర్ చాలా బాగా ఉంది. ఇది మంచికి చెడుకు జరిగే పోరాటాన్ని చక్కగా చూపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇలాంటి సినిమాల‌ను అంద‌రూ ఆద‌రించాలి. ఇందులో తెలుగు హీరోయిన్లు ఉన్నారు. తెలుగు వారికే డైరెక్ట‌ర్ వెంకట్ రెడ్డి గారు అవ‌కాశం ఇవ్వ‌డం అభినంద‌నీయం.” అని అన్నారు.

హీరో శ్రీకర్ మాట్లాడుతూ, “తెలుగు ఇండ‌స్ట్రీ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఉండ‌టం మ‌నంద‌రికి గ‌ర్వ‌కార‌ణం. డైరెక్ట‌ర్ వెంక‌ట్ రెడ్డిగారు ఎంతో శ్ర‌మించి అంద‌రికి న‌చ్చే విధంగా సినిమాను తెర‌కెక్కించారు. మా సినిమాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని తెలిపారు.

హీరోయిన్ అనుష మాట్లాడుతూ.. “నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ వెంక‌ట్ రెడ్డి గారికి కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమాను ప్ర‌తి ఒక్క‌రు ఆద‌రించండి. దూర‌పు కొండ‌లు నునుపు.. ద‌గ్గ‌రికి వెళితే గ‌రుకు.. తెలుగమ్మాయిల‌కు అవకాశం ఇస్తున్న‌ ఇలాంటి సినిమాల‌ను ఆద‌రించండి.” అని అన్నారు.

నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ, “హీరో శ్రీకర్‌కు మంచి భవిష్యత్తు ఉంది. డైరెక్టర్ వెంకట్ రెడ్డి గారి టాలెంట్ ఈ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది. ఇలాంటి సినిమాలను ప్ర‌తి ఒక్క‌రూ ఆద‌రించాలి.” అన్నారు.

డైరెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, “మా టీమ్‌ సభ్యులందరి కృషి వల్ల సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులందరూ దీన్ని ఆదరించాలి. ప్రేక్ష‌కుల న‌మ్మ‌కాన్ని మేం నిల‌బెట్టే విధంగా సినిమాను తెర‌కెక్కించాము. త్వ‌ర‌లోనే ఆడియో, ప్రీరిలీజ్‌ ఫంక్ష‌న్‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌బోతున్నాము” అని తెలిపారు.

వ‌డ్ల‌ప‌ట్ట‌, వినయ్ రాజ్, అర్చన, చిత్ర యూనిట్ స‌భ్యులు మాట్లాడుతూ.. ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచుతోంద‌ని అన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించాలని ఈ సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

న‌టీన‌టులు:

శ్రీకరన్, అనూష, షన్ను, చిత్రం శ్రీను, వెంకటేశ్వర్లు మూరంరెడ్డి, శ్రీమణి, బాల, M.నగేష్ బాబు, శ్రీకాంత్, నరేష్, రోశిరెడ్డి, వేదశ్రీ, సుభద్ర, నిహారిక, సుష్మ, సుబ్బు, వాణిశ్రీ, వెంకట్ రాజు, MS నాయుడు, ప్రసాద్, వెంకట రమణ (నాను), మిరాజ్ తదితరులు.

సినిమాటోగ్రఫీ: డి.యాదగిరి
ఎడిటింగ్: సాయి కుమార్, నరేష్.డి
మ్యూజిక్: డ్రమ్స్ రాము

సమర్పణ‌: శ్రీ శివ సాయి ఫిలిమ్స్ & శ్రీకరణ్

ప్రొడక్షన్ : వెంకటరెడ్డి నంది

పీఆర్వో: క‌డ‌లి రాంబాబు, ద‌య్యాల అశోక్‌